పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణబలరాములఁ గాంచి పౌరులు శోకించుట

“లక్కటా! ఈ కంసుఁ తి పాపకర్ముఁ
డెక్కడి యీ బాలురెక్కడి వీర
లెక్కడననిఁ జూడకెట్లుగావించె
క్కటా! వారించరైరి యెవ్వరును
ఈ సుకుమారుల నిటుసేయఁ దనకు
దోసంబుఁ దిట్టును దూరును గాదె? 
రుషత రిపులతో వరంబు సేయ
రిమేను ఘర్మకణాంచితంబగుచు
వివశితాంభోజంబువిధ మొందెఁ జూడుiv
డీ వాసుదేవులకీబారిగడవు
దైవమా” యని మ్రొక్కి రుణులు వగువ; 
దేవకియును వసుదేవుఁడుఁ భ్రీతి
గోవిందబలులఁ గనుంగొని వంతనొంది

iv) ఈ పద్యపాద మొక్కటియే కన్పడుచున్నది